Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Film స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి..

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి..

by CVR NEWS
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నేడు ఫిలింనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారు, ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ గారు, నందమూరి మోహన రూప గారు, నందమూరి సీమంతిని గారు, నందమూరి దీపిక, తుమ్మల ప్రసన్నకుమార్ గారు, పరుచూరి గోపాల కృష్ణ గారు, బాబు మోహన్ గారు, నిర్మాత భరద్వాజ్ గారు తదితరులు పాల్గొని పూలమాలలతో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ… “అందరి నమస్కారం. ఈరోజు తెలుగు జాతి మరువలేని రోజు, అన్నగారి పుట్టిన రోజు. తెలుగు జాతికి ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగు జాతికి ఒక వరం. ఆయన ఆశీస్సులు తెలుగు వారందరికీ ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను” అన్నారు.

నందమూరి మోహన కృష్ణ గారు మాట్లాడుతూ… “తెలుగు జాతి ఆరాధ్య దైవం, మా నాన్నగారు ఎన్టీఆర్ గారి గురించి అందరూ చెబుతుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. సినీ రాజకీయ రంగాలలో ఆయన ప్రజలను మెప్పించిన వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో పేదవాళ్ల ఆఖరి తెలిసిన వ్యక్తి కాబట్టి ఎన్నో మార్పులు తీసుకొచ్చి పేదవారి దైవంగా ఆయన నిలిచారు. ఆడవారికి ప్రత్యేక హక్కులు అలాగే ఆస్తులలో వాటాలు ఉండాలని గుర్తించిన వ్యక్తి. ఇప్పుడు దేశం అంతటా మనం ఆ మార్పును చూస్తున్నాము. ఈ సందర్భంగా ఆయనను మరోసారి స్మరించుకుంటున్నాను. అమీర్పేటలో నూతన ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణను చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు” అన్నారు.

మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ గారు మాట్లాడుతూ… “ఈరోజు సారధి స్టూడియోస్ దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రకారం నాకు చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఆయన పార్టీలో ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరారు. ఎంతమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారికి ప్రపంచమంతటా ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్” అన్నారు.

మాజీమంత్రి, నటుడు బాబు మోహన్ గారు మాట్లాడుతూ… “ఇక్కడికి విచ్చేసిన నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, ఆయన కుటుంబ సభ్యులకు నమస్కారం. మా తల్లితండ్రులు అన్న గారి అభిమానులు. నా చిన్నప్పటి నుండి ఆయనను అభిమానిస్తూ వచ్చాను. రాజకీయం అంటే ఏంటో తెలియని నన్ను రాజకీయాలకు ఆహ్వానించి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ప్రజల కోసం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న వ్యక్తి. ఆయన అడుగుజాడలలో నడిచాను, ఆయన ఎప్పటికీ మన మధ్యనే ఉన్నారు” అన్నారు.

“నందమూరి కుటుంబాన్ని అభిమానిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు. ఆయన సినీ రాజకీయ రంగాలలో అద్భుతంగా రాణించారు. ఆయన సమాజానికి ఎప్పుడూ ఈడెన్ మంచి చేయాలి అనుకునే వ్యక్తి. మన వంతు సాయం మనం చేయాలని చెప్తూ ఉండే వ్యక్తి” అన్నారు.

నందమూరి సీమంతిని గారు మాట్లాడుతూ… “ప్రజలంతా సమానం అంటూ ప్రజల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు” అన్నారు.

నందమూరి మోహన రూప గారు మాట్లాడుతూ… “మా తాత గారు, మా నాన్నమ్మ గారికి పాదాభివందనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి నందమూరి ఎన్టీఆర్ గారు. ఆయనను ఆరాధించని తెలుగువారు, పూజించని తెలుగువారు ఎవరు ఉండరు. ఎన్ని తరాలు మారిన ఒక్కరే ఎన్టీఆర్. రాష్ట్రంలో రాజకీయాలను ఒక మలుపు తిప్పిన వ్యక్తి ఆయన. రాష్ట్రానికి విపత్తు వచ్చిన ప్రతిసారి రాష్ట్రం కోసం, దేశం కోసం ముందున్న వ్యక్తి. స్వార్దం తెలియని వ్యక్తి. ఐక్యమత్యమే మహాబలం అని నమ్మిన వ్యక్తి. చిత్ర పరిశ్రమలో ఎవరికీ కష్టం వచ్చినా వారి కోసం నిలబడిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ప్రజలను దేవుళ్ళుగా చూసిన వ్యక్తి. ఎంతోమంది జీవితాలకు వెలుగు నింపి, వారి జీవితాలకు దారి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. తెలంగాణ రాష్ట్ర రాజధాని అమీర్పేటలో ఎన్టీఆర్ గాడి విగ్రహావిష్కరణ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 103వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను” అన్నారు.

ప్రముఖ నిర్మాత భరద్వాజ్ గారు మాట్లాడుతూ… “దేశంలో మన తెలుగు వారిని ఒక అడుగు ముందుకు నడిపించిన నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వారు కావడం ఎంతో గర్వంగా ఉంది” అన్నారు.

అనిల్ వల్లభనేని మాట్లాడుతూ… “ఎన్టీఆర్ గారి జయంతి అంటే ప్రతి తెలుగువారింట్లో ఒక పండగగా చేసుకుంటారు. తెలుగువారి ప్రఖ్యాతిని ప్రపంచానికి సాటి చెప్పిన వ్యక్తి. ఎంతోమంది కొత్తవారికి రాజకీయ ప్రయాణం నేర్పిన అటువంటి మహానుభావుని జయంతి సందర్భంగా మనమందరం ఇక్కడ కలుసుకోవడం నా ప్రేమతో ఆనందకరంగా ఉంది. తెలుగు వార్త ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనను స్మరించుకోవలసినదిగా ప్రార్థిస్తున్నాను” అన్నారు.

తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ… “ప్రపంచంలోనే ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు గారు. దేశంలో అప్పట్లోనే ఫ్యాన్ ఇండియా స్టార్ రామారావు గారు. బాలీవుడ్ నుండి ఎన్ని ఆఫర్లు వచ్చిన నా జీవితం తెలుగు వారికి అంకితం అని చెప్పి ఇక్కడే సినిమాలో చేసిన మహానుభావుడు. 60 సంవత్సరాలు వచ్చిన నటిస్తూనే ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. ప్రజలే నా కుటుంబం అంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలందరిని సమానంగా చూస్తూ వారి అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన వల్ల ఎంతోమంది రాజకీయాల్లో వచ్చి చైతన్యంగా పనిచేశారు. ఎన్టీఆర్ గారి తెలుగువాడు కావడం తెలుగువారి అదృష్టం, తెలుగు వారంతా గర్వపడవలసిన విషయం. ప్రభుత్వంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన విగ్రహానికి ఆవిష్కరణ జరగడం అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఇక్కడే అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని అభిమానులతో కలిసి ఆయన జయంతిని ఒక పండుగలా జరుపకోవడం ఆనందకరం. జై ఎన్టీఆర్!” అన్నారు.

నివాళులు అర్పించిన పిమ్మట 1000 మందికి పైగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరిట ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018627
Total views : 89042

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.