Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Latest News ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ కి మరో షాక్..

ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ కి మరో షాక్..

by Prakash
Aam Aadmi Party

ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) :

లోక్ సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం కేబినెట్ లో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. ఆప్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అవినీతిపై పోరాడేందుకు ఆప్ పుట్టింది కానీ.. ఇప్పుడు అదే పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అవినీతి పరులతో తాను ఉండలేనన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ క్రమంలో ప్రభుత్వానికి, పార్టీకి తాను దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాజ్ కుమార్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. ఇదే కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ కి మరో షాక్..
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: