Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News హుస్నాబాద్ ఆర్డివో కార్యాలయం ఎదుట పోతారం గ్రామస్తులు నిరాహార దీక్ష

హుస్నాబాద్ ఆర్డివో కార్యాలయం ఎదుట పోతారం గ్రామస్తులు నిరాహార దీక్ష

by Rama
హుస్నాబాద్ ఆర్డివో కార్యాలయం ఎదుట పోతారం గ్రామస్తులు నిరాహార దీక్ష

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డివో కార్యాలయం ఎదుట పోతారం గ్రామస్తులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని, తమ భూములను తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోతారం గ్రామ శివారులో తమకు చెందిన భూములను కొంతమంది భూ ఆక్రమణదారులు అక్రమంగా వారి పేరిట పట్టాలు చేయించుకున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయమై స్థానిక ఆర్డివో కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు..ఇప్పుడు ఆక్రమణదారులు వారి పేరు మీద చేయించుకున్న భూమిని యదేచ్చగా మరొకరి పేరు మీద మార్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆ భూములపై ఆధారపడిన 10 నుండి 12 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. తమకు న్యాయం చేసేంతవరకు నిరాహార దీక్షను కొనసాగిస్తామని గ్రామస్తులు పట్టుపట్టారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
    కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
  • అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.
    అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
  • శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.
    శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్‌ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
  • ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.
    ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ…
  • AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
    కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: