మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. లోకేష్‌తో పాటు పలువురు కూటమి నేతలు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మను కలవనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించింది. పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది. ఈ క్రమంలోనే అమరావతి రైతులు కల నెరవేరింది. ఈ సందర్భంగా ప్రజల తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రపతిని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలవనున్నారు. దీని కోసం నిన్న ఢిల్లీకి వెళ్లిన మంత్రి నారా లోకేష్… ఇవాళ రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆమెకు అమరావతి విశిష్టతలు తెలియజేసే బుక్ లెట్‌ను అందజేయనున్నారు.
ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ …
122
previous post





Total views : 89064