ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో పాటు అమరావతిలోని సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కోసం 798 కోట్ల రూపాయల ప్రణాళికతో పాటు ఉండవల్లి జోన్‌లో మౌలిక వసతుల కోసం 580 కోట్ల రూపాయల ప్రణాళికకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 220 కేవీ కేబుల్స్ రీరూటింగ్ పనులకు 1,180 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్‌కు భూమిని కేటాయించింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 2000 బ్యాచ్‌కు చెందిన 385 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ కల్పించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..
32
previous post




Total views : 61456