తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై 15 మందితో కమిటీ ఏర్పాటుచేసింది. అందులో సభ్యులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ర్టిబ్యూటర్స్ ఉంటారు.
ఈ కమిటీలో ఒక్కో విభాగం నుంచి ఐదుగురు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు, నిర్మాతలు భేటీ అయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాతలు, ప్రముఖ ఎగ్జిబిటర్లు హాజరై తమ గళాన్ని వినిపించారు. నిర్మాతలు,ఎగ్జిబిటర్స్ మధ్య నెలకొన్న వివాదంతో పాటు ఫిల్మిండస్ట్రీలో ఎదురవుతున్న సవాళ్లు, థియేటర్ల యాజమాన్యాల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, స్రవంతి రవి కిషోర్, సి. కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఓటీటీ ప్రభావం, టికెట్ ధరలు, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సమన్వయం పెంచడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది.






Total views : 76909