Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Devotional యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

by CVR NEWS
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

యాదగిరిగుట్టలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేశారు. వేదపాఠశాల, కల్యాణ మండపం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ హాజరయ్యారు.

కంచి కామకోటి పీఠాధిపది శ్రీశంకర విజయేంద్ర సర్వస్వతి స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. 43 కోట్ల 79 లక్షలతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్‌ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేదపాఠశాల భవనం నిర్మించనున్నారు. వచ్చే రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. ఇక 9 కోట్ల 88 లక్షల ఖర్చుతో కొండపై నిత్య కల్యాణం, రంగం మండపం నిర్మాణం, కోటీ 41 లక్షలతో మెట్ల మార్గానికి పైకప్పు, కోటీ 44 లక్షలతో మాఢవీధులకు మెట్లు, 43.5 కోట్లతో దీక్షాపరుల మండపం పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: