తెలంగాణలో పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. జూన్ 1 నుంచి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి రెండు వేల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్థలాలు ఉన్న 1,500 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 14,800 పూరిగుడిసెల కుటుంబాలకు కూడా రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు ఉన్న మరో 18,500 మందికి రూ.5 లక్షల చొప్పున నేరుగా అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో లక్ష ఇళ్లు నిర్మించి పేదలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే 7 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం ఈ పథకంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని చూపిస్తోందన్నారు. కేబినెట్ సమావేశంలో గృహ నిర్మాణంతో పాటు రైతు సంక్షేమం, ఉద్యోగాల భర్తీ, తాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని మంత్రులు పేర్కొన్నారు.
జూన్ 1న ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత ప్రారంభం..
41






Total views : 89145