79
పాలకులు మారినా రాయలసీమ తలరాత మారదా? సీమ గుండెల్లో దశాబ్దాలుగా రగులుతున్న జలవనరుల ఆకాంక్షకు మళ్లీ గండి పడనుందా? దాహంతో అలమటిస్తున్న గొంతుకు గుక్కెడు నీళ్లు ఇవ్వడం మానేసి.. చేతికి రంగుల గొడుగు ఇచ్చినట్లుంది సిద్ధేశ్వరం ‘ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి’ ప్రతిపాదన. వినడానికి, ఈ ‘తీగల వంతెన’ ఆలోచన ఎంతో అద్భుతంగా ఉన్నా.. స్థానిక అవసరాల దృష్ట్యా చూస్తే ఇది సీమ ప్రజల నోట్లో మట్టి కొట్టడమేనని మేధావులు మండిపడుతున్నారు. తమకు పర్యాటక హంగుల కంటే.. ప్రాణాధారమైన నీరే కావాలంటున్నారు. దీనికోసం ‘బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ’ కట్టాలన్న డిమాండ్ ఇప్పుడు రాయలసీమలో ఉద్యమ రూపం దాల్చుతోంది. అసలు కేంద్రం ప్రతిపాదన ఏంటి? సీమ జనం కోరుకుంటోంది ఏంటి? దీనిపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనం!






Total views : 89099