Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh ఉమ్మడి ఖమ్మం జిల్లా దశాబ్దాల సాగునీటి కల సాకారం..

ఉమ్మడి ఖమ్మం జిల్లా దశాబ్దాల సాగునీటి కల సాకారం..

by CVR NEWS
ఉమ్మడి ఖమ్మం జిల్లా దశాబ్దాల సాగునీటి కల సాకారం

ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిట ‘సీతారామ ప్రాజెక్టు’ వరప్రదాయినిగా మారింది. ఒకప్పుడు నిర్లక్ష్యపు నీడలో నత్తనడకన సాగిన ఈ ప్రాజెక్టు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూపురేఖలు మార్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, జిల్లా సీనియర్ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.గత కేసీఆర్ ప్రభుత్వంలో 8 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి బి.జి.కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం పంప్ హౌస్‌లను నిర్మించినప్పటికీ.. ఆ తర్వాత పనులను గాలికొదిలేశారు. కానీ, రేవంత్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు, సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి నిధులు మంజూరు చేయించారు. యుద్ధప్రాతిపదికన పనులను పరుగులు పెట్టించి, వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లను వైరా రిజర్వాయర్‌కు తరలించేలా అద్భుత వ్యూహాన్ని అమలు చేశారు. కేవలం పనులు పూర్తి చేయడమే కాదు.. ప్రాజెక్ట్ కింద డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రూ.13 వేల 58 కోట్ల నుంచి ఏకంగా రూ.19 వేల 325 కోట్లకు పెంచుతూ సవరించిన అంచనాలకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో ఆమోదం ముద్ర వేశారు. సొంత పార్టీ వారే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. రైతుల శ్రేయస్సే ముఖ్యమని సీఎం రేవంత్ పెద్ద మనసుతో నిధులు కేటాయించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018819
Total views : 89480

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.