Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.

స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.

by CVR NEWS

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి స్పీకర్ స్థాయికి ఎదిగిన వ్యక్తిని దూషించడం ఏంటని భట్టి ప్రశ్నించారు. ఇది కేవలం స్పీకర్‌కు జరిగిన అవమానం కాదని.. యావత్ శాసనసభకు జరిగిన అవమానమని అన్నారు.

ఆత్మగౌరవ పోరాటం నుంచి తెలంగాణ అసెంబ్లీ పుట్టిందని.. అలాంటి సభ ఆత్మగౌరవంపైనే దాడి చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆత్మగౌరవంపై దాడి జరిగితే మరిన్ని పోరాటాలు తప్పవని హెచ్చరించారు. స్పీకర్‌పై మాట్లాడిన భాష.. బీఆర్‌ఎస్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ది ఫ్యూడల్ మనస్తత్వమని ఆరోపించారు. రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: