Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Latest News నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం ..

నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం ..

by CVR NEWS

తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఇవాళ ఉదయం 11:30 గంటలకు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాల సమాచారం. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక బిల్లు, కావాల్సిన మెజార్టీ సాధించలేకపోయింది. ఈ బిల్లు వీగిపోయిన వెంటనే అధికార పక్షం తదుపరి వ్యూహరచనలో పడింది. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడంపై అధికార ఎన్డీయే కూటమి తీవ్రంగా స్పందించింది. బిల్లు వీగిపోయిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విపక్షాల తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు కాలరాశాయని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా సాధికారతకు విపక్షాలు మొదటి నుంచీ అడ్డుపడుతున్నాయి. నేడు వారి మహిళా వ్యతిరేక మైండ్‌సెట్ దేశం ముందు బట్టబయలైంది అని ప్రధాని మోడీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. మహిళా బిల్లుకు తాము అనుకూలమని చెబుతూనే, డీలిమిటేషన్ సాకుతో ఓటింగ్‌లో వ్యతిరేకించిన ‘ఇండియా’ కూటమి ద్వంద్వ నీతిని ఎండగట్టాలని ఎన్డీయే తీర్మానించింది. ఈ ఆందోళనల్లో బీజేపీ మహిళా మోర్చా సహా భాగస్వామ్య పక్షాల మహిళా విభాగాలను చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తుంది

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: