Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Political స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల…

స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల…

by CVR NEWS

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టన్నెల్స్‌లో ఐదు గ్యాంట్రీలతో జరుగుతున్న లైనింగ్ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. రాత్రి వేళలోనే పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టన్నల్ లోపల 12 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎం మిషన్ను తొలగించేందుకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందని టీబీఎం మిషన్ను తీసివేసినట్లయితే నీరు అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. టీబీఎం తొలగించకుండా, ఇంకా 3 వేల కోట్ల పనులు చేయాల్సి ఉన్నా వెలిగొండ ను జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతులను జగన్ మోసం చేశాడని విమర్శించారు. టన్నెల్- 2 లోనే అధికారులు, కార్మికుల తో కలసి భోజనాలు చేశారు మంత్రి నిమ్మల.

Advertisements

You may also like

Our Visitor

023980
Total views : 143671

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.