Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Sports Hyderabad Vs Bangalore : బెంగళూరు రెండో విజయం..

Hyderabad Vs Bangalore : బెంగళూరు రెండో విజయం..

by Satya
Hyderabad Vs Bangalore

ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు(Bangalore) రెండో విజయం సాధించింది. హైదరాబాద్‌(Hyderabad)తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో షాబాజ్‌ అహ్మద్‌ (40) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (31), కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (31) చెలరేగారు.

ఇది చదవండి: LSG vs DC IPL 2024 | ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో విజ‌యం..

మిగతావారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌, గ్రీన్‌, కర్ణ్‌ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. విల్‌ జాక్స్‌, యశ్‌ దయాల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన డుప్లెసిస్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ 51, రజత్‌ పటిదార్‌ 50, కామెరూన్‌ గ్రీన్‌ 37, డుప్లెసిస్‌ 25 పరుగులతో రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ మూడు వికెట్లు పడగొట్టగా, నటరాజన్‌ 2, కమిన్స్‌, మార్కండే ఒక్కో వికెట్‌ తీశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • మంగళగిరిలో మెగా ఫ్యాన్ పార్క్
    మంగళగిరిలో ఐపీఎల్ లైవ్ అనుభూతిని పంచేందుకు ‘మెగా ఫ్యాన్ పార్క్’ సిద్ధమైందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తెలిపారు. రేపు, ఎల్లుండి జరగబోయే ఉత్కంఠభరిత ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం మంగళగిరి టిడ్కో పార్క్ ప్రాంగణంలో సకల…
  • కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయం..
    ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్ ఆర్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని…
  • టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖితమైంది.
    టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖితమైంది. బ్రెజిల్ మహిళల జట్టు కెప్టెన్ లారా కార్డోసో అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించింది. బీసీఏ కలహారీ మహిళల టీ20ఐ టోర్నమెంట్ 2026లో భాగంగా లెసోతోతో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

008590
Total views : 56906

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.