Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోంది.

by CVR NEWS

తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా తన ప్రసంగాలలో క్రీడలపై మక్కువ చూపిస్తున్నారు. ఇటీవల క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లాలో మాత్రం ఇండోర్ స్టేడియం మరమ్మతు పనులు వెనుకబడుతున్నాయి. క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలసముద్రంలో కొనసాగు తున్న బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం మరమ్మతు పనులు మూగనోము పట్టాయి. ఇండోర్ స్టేడియంలోని ఉడెన్ కోర్టు, మ్యాట్లు, విద్యుత్ లైట్లు, రేకులు, కిటికీల సుందరీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇండోర్ స్టేడియం నత్తనడకన సాగుతున్న విధానం పై సీవీఆర్ న్యూస్ స్పెషల్ స్టోరీ

హనుమకొండలో ఏడాది కిందట చేపట్టిన ఇండోర్ స్టేడియం మరమ్మతు పనులు సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో ముందుకు సాగటం లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు జరగడం లేదు. గతేడాది ఏప్రిల్ లో DSA నిధుల నుంచి 68 లక్షల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. స్టేడియం మర మ్మతు, సుందరీకరణ పనులకు వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య లాంఛనంగా శంకు స్థాపన చేశారు. కలెక్టర్, అధికారులు పర్యవేక్షిస్తున్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు.

రెండు నెలల్లో స్టేడియం అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. కొన్ని నెలలుగా ఇండోర్ స్టేడియంలో సుందరీకరణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. బ్యాడ్మింటన్ శిక్షణ పొందే వర్ధమాన క్రీడా కారులు పనులు పూర్తికాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనుల్లో జాప్యం కారణంగా క్రీడాకారులు హనుమకొండ సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో తాత్కాలికంగా శిక్షణ పొందు తున్నారు. ఆఫీసర్స్ క్లబ్ స్టేడియంలో ఫీజులు ఎక్కువగా ఉండటం, ఇక్కడ గతంలో శిక్షణ తీసుకునే వారికే క్లబ్ నిర్వాహకులు ప్రాధాన్యం ఇవ్వడంతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో వేసవి సెలవులు వస్తున్నాయి. కానీ ఇంకా ఇండోర్, స్విమ్మింగ్ పూల్ పనులు పూర్తి కాకపోవడంతో వర్ధమాన క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా. DSA అధికారులు పట్టించుకోక పోవడంతో బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇండోర్ స్టేడియం పనులతోపాటు స్విమ్మింగ్ పూల్ ను అందు బాటులోకి తీసుకురావాలని క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: