Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home Andhra Pradesh జగన్ తిరుమల పర్యటనకు డిక్లరేషన్ తంటా!

జగన్ తిరుమల పర్యటనకు డిక్లరేషన్ తంటా!

by Satya
జగన్ తిరుమల పర్యటనకు డిక్లరేషన్ తంటా!

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన ఏపీలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిపారనే వివాదం పూర్తిగా ముదిరిన వేళ ఆయన తిరుమలకు వెళ్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు, బీజేపీ, వీహెచ్ పీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. క్రైస్తవుడైన జగన్ హిందూమతంపై, వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉందనే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జగన్ ను అలిపిరి వద్దే అడ్డుకుంటామని స్వామీజీలు హెచ్చరించారు. జగన్ కు వ్యతిరేకంగా అలిపిరి వద్ద నిన్న పలువురు స్వామీజీలు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.
మరోవైపు, తిరుపతిలో జగన్ కు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన నిర్ణయించినట్టు తెలుస్తోంది. డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకునే ప్రక్రియ అని అన్యమతాలపై మాట్లాడొద్దని జనసైనికులకు పవన్ సూచన. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలకు జనసేన శ్రేణులు దూరంగా ఉంటున్నారు. బీజేపీ శ్రేణులు అప్పుడే రంగంలోకి దిగాయి. ఇంకోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసు భద్రతను పెంచారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, నిరసన కార్యక్రమాను చేపట్టకూడదని పోలీసులు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
    ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
  • ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.
    దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
  • టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.
    టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
  • ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.
    ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
  • నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .
    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: