Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Telangana జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్..!

జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్..!

by Satya
Kishan Reddy

జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 6 నెల్లుగా వీధిలైట్లు లేకపోవడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటించారు. అఘాపురలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సమయంలోనే స్థానికులు కేంద్రమంత్రికి తమ కష్టాలు చెప్పుకున్నారు. ఈ ప్రారంభోత్సవాలు సరే, తాము చీకట్లో ఉంటున్నామన్న ప్రజలు ముందు ఆ విషయం చూడాలని కోరారు. ఆరు నెలలుగా వీధిలైట్లు లేవన్నారు. గత ఏడాది నవంబరులో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. దీంతో అక్కడే ఉన్న అధికారులను కిషన్ రెడ్డి వాకబు చేశారు. నిధులు లేక వీధిలైట్లు వేయలేకపోతున్నామని వా బదులు చెప్పడంతో అక్కడికి అక్కడే జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కు కేంద్ర మంత్రి ఫోన్ చేశారు. సమస్య పరిష్కరించాలని ఆయనకు సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

012471
Total views : 75210

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.