Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు..

సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు..

by CVR NEWS
సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలవడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధికారికంగా ఇది రాజ్యసభ ఎన్నికల వ్యూహాలపై చర్చ కోసమేనని చెప్పినా, దీని వెనుక మరిన్ని రాజకీయ అంశాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతోంది. ముఖ్యంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, అధికార పంపకాల ఒప్పందాలు, విధాన మండలి ఎన్నికల అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. సీఎం ఢిల్లీ పర్యటనపై తనకు ఎలాంటి సమాచారం లేదని, అది రాజ్యసభ ఎన్నికల కోసమా లేక నాయకత్వ మార్పు గురించా అనేది తెలియదని ఆయన అన్నారు. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మరింత పెరిగాయి.
మరోవైపు, హోంమంత్రి జి.పరమేశ్వర మాత్రం నాయకత్వ మార్పు ప్రచారాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకునేది పూర్తిగా హైకమాండేనని స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018627
Total views : 89042

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.