Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు.

అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు.

by CVR NEWS
అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు

అండమాన్‌ సముద్రంలో ‘ఆయిల్‌ ఇండియా’ సంస్థ కొత్త సహజ వాయువు నిక్షేపాలను కనుగొంది. అండమాన్‌ జలాల్లోని శ్రీవిజయపురం-3 బావిలో ఈ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి తెలిపారు. ఈ బావి అండమాన్‌ దీవులకు తూర్పు తీరాన 15 కిలోమీటర్ల దూరంలో, 900 అడుగుల లోతులో ఉన్నట్లు వెల్లడించారు. ఇక్కడి బావిలో సహజ వాయువు ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఆ గ్యాస్‌ మిశ్రమంలో ఏయే వాయువులు ఎంత శాతం ఉన్నాయన్నది తేల్చడానికి నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. అండమాన్‌ బేసిన్‌లో ఆయిల్‌ ఇండియా చేపట్టిన చమురు అన్వేషణలో ఇది రెండో విజయమన్నారు. భారతదేశం చమురు, గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం కోసం ఈ ఏడాది చివరికల్లా అండమాన్‌ రీజియన్‌లో మరిన్ని చమురు అన్వేషణ బావులను తవ్వాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది ఆయిల్‌ ఇండియాకు చెందిన శ్రీవిజయపురం-2 బావిలో గ్యాస్‌ను గుర్తించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: