Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Political తెలుగు తమ్ముళ్లపై పోలీసులు లాఠీఛార్జ్…

తెలుగు తమ్ముళ్లపై పోలీసులు లాఠీఛార్జ్…

by Prakash
Police lathi charge

అన్నమయ్య జిల్లాలో తెలుగుతమ్ముళ్లపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీఛార్జ్ చేశారు. తంబళ్లపల్లిలో రిటర్నింగ్ ఆఫీస్ కు వంద మీటర్ల దూరంలో ఉన్న తెలుగు తమ్ముళ్లపై పోలీసులు ట్రైనీ డీఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో లాఠీఛార్జ్ చేశారు. దీంతో టిడీపీ కార్యకర్తలు ఆగ్రహవేశానికి లోనయ్యారు. నిన్న జరిగిన వైసీపీ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో అధికార పార్టీకి తొత్తులుగా మారి బారీ కేడ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో వైసీపీ నేతలు ఆర్వో కార్యాలయం ఎదుటే రోప్ వే ఏర్పాటు చేసి నానా హంగామా సృష్టించారు. అధికారపార్టీకి ఒక న్యాయం, మాకో న్యాయమా అంటూ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు తెలుగు తమ్ముళ్లపై జులుం ప్రదర్శించారు. టీడీపీ కార్యకర్తలు కూడా పోలీసులపై ఎదురుదాడి చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

Advertisements

You may also like

Our Visitor

008593
Total views : 56909

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.