Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Telangana మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

by Satya
మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

మూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్‌గా, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ ఛైర్మన్‌గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మూసీ రివర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దాన కిషోర్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమశాఖతోపాటు పాఠశాల విద్య కమిషనర్, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలోని సభ్యులు..తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

  • అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..
    అంతరిక్ష పరిశోధన రంగంలో తెలంగాణ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ వేదికగా రూపుదిద్దుకున్న దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపారు ముఖ్యమంత్రి రేవంత్…
  • ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..
    సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని…
  • కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది ఎకరాల్లో పండిన వరి పంట కోత దశలో ఉన్నా, డీజిల్ కొరత కారణంగా కోతలు నిలిచిపోతున్నాయి. బంకుల వద్ద రైతులు డీజిల్ కోసం డబ్బాలతో…
  • భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..
    భద్రాచలం పట్టణంలో పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహం పెను వివాదానికి దారితీసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్లను డంపింగ్ యార్డ్‌లో పడేసి ఘోరంగా అవమానించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది చెత్తకుప్పలో పడేయడంపై…
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
    ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రావిగూడెం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని దీర్ఘకాలిక సమస్యలకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

008252
Total views : 54157

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.