ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోంది. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు. ఆన్‌లైన్ ద్వారా లోడింగ్, అన్ లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు మాత్రం చెల్లించి ఇసుక పొందే అవకాశం కల్పించారు. అయితే ఉచిత ఇసుకపై సోషల్ మీడియా వేదిక ద్వారా అసత్య ప్రచారం జరుగుతుండటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా జరుగుతున్న ప్రచారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి బ్రేక్ వేయాలని మీనాను ఆదేశించారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా ఉచిత ఇసుకపై ప్రజల్లో అపోహలు కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు. దీనిపై కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి, ఈ తరహా పనులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న శాండ్ పాలసీపై జిల్లా స్థాయిలో నిజానిజాలు వెలికితీసి, తప్పుడు ప్రచారం చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి