Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home Main News అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం

అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం

by Satya
అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం

త్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోఅయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుంది. సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకమీదట శబరిమల వచ్చే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అయ్యప్ప భక్తులు పరమ పవిత్రంగా భావించే మకరవిళక్కు సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. స్వామివారి దర్శనానికి ఆన్ లైన్ బుకింగ్ ను తీసుకువస్తున్న కేరళ ప్రభుత్వం… రోజుకు 80 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. వర్చువల్ క్యూ బుకింగ్ విధానంలో భక్తులు తాము వచ్చే మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రమంలో, అటవీమార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
    ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్‌తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
  • ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.
    దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
  • టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.
    టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
  • ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.
    ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
  • నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .
    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: