తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుమన్.ఆలయం వెలుపల సుమన్ మీడియాతో మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారన్నారు. మంచి కాంబినేషన్ లో కొత్త ట్విస్ట్‌తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి అవకాశం రావడం., జనసేన అధినేత పవన్ అన్ని సీట్లలో క్లీన్ స్వీప్ చేయడం జరిగిందని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుమన్. వచ్చే ఐదేళ్లలో జరగాల్సిన అభివృద్ధికి పునాదులు వేశారన్నారు. విద్యా., వైద్యం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. అమెరికా లాంటి క్యాపిటల్ ఏపీకి రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. హైదరాబాద్ లాంటి నగరం ప్రపంచ స్థాయి నగరంగా ఎదగడానికి చంద్రబాబే కారణమని గుర్తు చేశారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. అమరావతి కాస్మో పాలిటన్ సిటీగా ఎదగాలన్నారు. తిరుపతి, ఈస్ట్., వెస్ట్ గోదావరిలో ఫిల్మ్ సిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతిని టెంపుల్ సిటీగా డిక్లర్ చేయాలని విజ్ఞప్తి చేశారు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.