చింతలపూడి మండలం పాత చింతలపూడి, మల్లాయగూడెం, పోతునూరు గ్రామాలలో ఎండిపోయిన వరి పొలాలను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 వేల ఎకరాల వరి ఆయకట్టు ఉంటే, దానిలో దాదాపు 2500 ఎకరాల నుండి మూడు వేల ఎకరాలు పంట వర్షం లేక ఎండి పోవడం జరిగింది అన్నారు. రైతులకు పంట నష్టం ఇవ్వటానికి రెండు రకాల విధానాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించడం ఒక విధానం , జగనన్న ప్రవేశపెట్టిన ఈక్రాఫ్ నమోదు చేసుకున్న రైతులకు ఇన్సూరెన్స్ ద్వారా నష్ట పరిహారం ఇవ్వటం జరుగుతుందని, అధికారులు ఆ దిశగా నష్టపరిహారం అంచనాలు పంపడం జరుగుతుందని , రైతులకు నష్ట పరిహారం ఇప్పించే విధంగా నేను కూడా కృషి చేస్తానని ఆయన అన్నారు.
Tag:
Agriculture
పల్నాడు జిల్లా పెదకూరపాడు,అచ్చంపేట, క్రోసూరులలో పంటపొలాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, పలువురు రైతు నాయకులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో తీవ్రవర్షాభావ పరిస్థితులున్నాయి .. 122 యేళ్ళ క్రితం ఇదేవిధంగా వర్షాభావం ఏర్పడింది పొలాల్లో పంటలు దెబ్బతిన్నాయి,దాంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించి , రైతాంగానికి వెంటనే సాగునీరు అందించి, తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు .
Older Posts






Total views : 147666