అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంగురాళ్ల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అదునుచూసి అధికారుల కళ్ళుకప్పి రంగురాళ్ల కొండలను రంగురాళ్ల వ్యాపారులు తవ్వేస్తున్నారు.అల్లూరి జిల్లా జీకే వీధి మండలం సిగినాపల్లి కొండపై జోరుగా రంగురాళ్ల క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయి. పది రోజుల్లో కోట్లల్లో వ్యాపారం జరిగిందని, ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు వుంటుంన్నారని స్థానికులంటున్నారు. నర్సిపట్నం, చింతపల్లికి చెందిన రంగురాళ్లు వ్యాపారులు అమాయకులైన పేద గిరిజనులకు మద్యం,డబ్బులు ఇచ్చి రంగురాళ్ల కొండపైకి ఎక్కించి తవ్విస్తున్నారు. వీరిపై పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా వాటిని సహితం లెక్కచేయకుండా రంగు రాళ్లు ఉన్న కొండలను తవ్విస్తున్నారని , వీరిపై నిరారంతరంగా నిఘా వుందని చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ డీఎఫ్ఓ సిహెచ్ సూర్యనారాయణ తెలిపారు.
#AndhraPradesh #
తిరుమల అక్టోబర్ 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత పడుతుంది. ఎనిమిది గంటలకు పైగా ఆలయం తలుపులు టిటిడి అధికారులు మూసి వేయనున్నారు. 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా 28న రాత్రి 7:05 గంటలకు టీటీడీ అధికారులు ఆలయం మూసివేస్తామన్నారు. తిరిగి గ్రహణం విడిచాకా అక్టోబరు 29 తెల్లవారుజామున 3:15 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం రద్దు చేశామన్నారు.
చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుటుంబసభ్యులు ములాఖత్ కానున్నారు. బాబును నారా భువనేశ్వరి, నారా లోకేష్ కలవనున్నారు. తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర ముగించుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో భువనేశ్వరి బయల్దేరారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కుటుంబసభ్యుల ములాఖత్ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఇటీవల భువనేశ్వరికి రిపోర్ట్ పంపించారు. అలాగే జైల్లో తన భద్రతకు ముప్పు ఉందని ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. ఇలాంటి తరుణంలో కుటుంబసభ్యులు ములాఖత్ కానుండటం కీలకంగా మారింది. గత రెండు ములాఖత్‌ల తర్వాత కుటుంబసభ్యులు మీడియాతోనే మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీంతో రేపు చంద్రబాబుతో ములాఖత్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడతారా..? లేదా? అనేది కీలకంగా మారింది.
సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు. రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్నారు. 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు. ఐటీలో హైదరాబాద్, బెంగళూరును మించిపోయిందన్నారు.
విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం.
స్థల పురాణం
అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది. దాంతో ఆరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.
క్షేత్ర విశేషాలు
సింహాచలంలో ఉండే స్వామివారి గాలిగోపురంకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా సింహాచలంలోని గాలిగోపురం పడమర ముఖంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే ద్వజస్థంభాన్ని కప్ప స్థంభం అని వ్యవహరిస్తారు. గతంలో ఇక్కడే కప్పం అనబడే పన్నులు చెల్లించేవారని అందుకే కాలగమనంలో ఈ స్థంభానికి కప్ప స్థంభం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.సింహాచలం కొండపై అక్కడక్కడా జలధారలు ప్రవహిస్తుంటాయి. భక్తులు వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారు. వీటిలో గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనేవి ముఖ్యమైనవి.
శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది. ఇక్కడి సూర్యదేవాలయం లో కల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వార తెలియుచున్నది. హర్షవల్లి అనే ప్రాచీన పేరు అరసవల్లిగా మారిందనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజామునవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట.
150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ది చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది. ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి.అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి. ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఇకపోతే… అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. నేడు తుఫాను కారణంగా ఆకాశం మబ్బులు పట్టడంతో ఆందోళన చెందిన భక్తులకు సూర్యకిరణాలు మూడు నిముషాలసేపు మూలవిరాట్టు పాదాలపై పడడంతో భక్తుల ఆనందానికి అంతులేకుండా పోయింది.