నిధులు కేటాయించకుండానే విధులు కేటాయించే దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో దాపురించాయని మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నేతల దోపిడీ విధానాలను వివరిస్తూ..తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నదుల అనుసంధానంతో..నీటిని మరొకప్రాంతానికి తరలించుకునే అవకాశం ఉన్నప్పటికీ..ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఏడాదికి మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందన్నారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పూర్తయినా..నీటిని తెచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఏ కోశానా చేయడంలేదన్నారు.జిల్లాలోని మెట్టప్రాంతాలు నీటి కోసం వేడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. వైకాపా పాలనలో రైతుల గోడును తీర్చే నాధుడే కరువయ్యాడని మండిపడ్డారు.కొసమెరుపుగా మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై సెటైర్స్ వేశారు. సైదాపురం అక్రమ మైనింగ్ అంతా టిడిపి నేతలదే అని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి అనీల్ యాదవ్ తాను కూడా తన మనుషుల ద్వారా అక్రమ మైనింగ్ త్రవ్వకాలు జరిపినది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు
#ap #tdp
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు ఏర్పాటైన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సరికొత్త వ్యూహాలను ఖరారు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు రెండు పార్టీల కమిటీ నేతలు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఖరారు చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నవంబర్ 1 నుండి నారా లోకేష్ బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమయ్యారని, రాబోయే రోజుల్లో జగన్ పాలను అంతమొందించడమే టిడిపి జనసేన ప్రధాన లక్ష్యమని టిడిపి జనసేన కలిసికట్టుగా వైసీపీని ఓడించి తీరుతామంటున్న టిడిపి మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తపై పుంగనూరులో వైసీపీ నాయకుడు రెచ్చిపోయిన ఘటనపై నారా భువనేశ్వరి స్పందించారు. పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనమని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఒక ఉదాహరణ అని అన్నారు. పేదలపై పెత్తందారీ పోకడలకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం అంటే ఒక కుటుంబమని, మా నేతలను అక్రమంగా జైలులో పెట్టారని నిరసన కూడా చేయకూడదా? అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా? అని నిలదీశారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అని భువనేశ్వరి అన్నారు.
జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యతని మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. పురుగు మందు డబ్బా తీసుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన ఇవాళ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మోత్కుపల్లి మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారు. ఆయన్ను హింసించి బాధపెడుతున్నారు. జగన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సీఎం.. జగన్. చంద్రబాబు కుటుంబానికి భద్రత లేదు. ఏపీలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేశారు. చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను సాధించాలని ప్రయత్నమా? ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి జగన్ మళ్లీ గెలవాలని చూస్తున్నారు అని మోత్కుపల్లి మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష కారణంగానే జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం అని, చంద్రబాబు అమాయకుడని పేర్కొన్నారు. ఇది కావాలని చేసిన చర్యేనని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వెనుక ఉన్నది బీజేపీనే అని ఢిల్లీలో పాలు తాగే పిల్లవాడ్ని అడిగినా చెబుతారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. పేరుకే జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం, సీఐడీ ఉన్నాయే కానీ, దీని వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు. జడ్జిలకు 17ఏ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు 40 రోజులకు పైగా సమయం కావాల్సి వచ్చిందా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని తాను నమ్ముతున్నానని చింతా మోహన్ స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. అనంతపురం నుంచి మంగళగిరి వరకు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చేరుకుంది. సైకిల్ యాత్రకు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మండల కన్వీనర్ పెలపూడి వెంకటరత్నం తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.