దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో టిడిపి,జనసేన నేతలపై ఆయన పోస్ట్ లు పెట్టడంపై ఎపిలో వివిధ పోలీస్ స్టేషన్ లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి.. దీనిపై ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు మొత్తం మూడు కేసులు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎప్పుడు పిలిస్తే అప్పడు పోలీసుల విచారణకు హాజరుకావాలని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని కండిషన్ విధించింది కోర్టు. 2022 సంవత్సరంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీడీపీ, జనసేన అధినేతలతో పాటు నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని పలువురు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఫిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆర్జీవీ ని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణకు గైర్హాజరైన ఆర్జీవి తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్‌లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90126