ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది. యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు. కేసీఆర్ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొంటారు. విశాఖ శారదా పీఠాధిపతులతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. యాగశాలలో ఈరోజు రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. యాగంలో మొత్తం మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేస్తారు. అలాగే 11 సార్లు శూలినీ దుర్గ కవచ పారాయణ ఉంటుంది. సర్వ లోక సంరక్షణార్ధం ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్త హోమం నిర్వహిస్తారు. షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం కూడా నిర్వహిస్తారు.
CM KCR
ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ఒక్కో పార్టీ నుంచి ఒక వ్యక్తి బరిలో నిలబడతాడతారన్నారు. వారి వెనక ఒక పెద్ద పార్టీలు ఉంటాయని, ఆ పార్టీల వైఖరి, చరిత్ర, ప్రజల పట్ల వాటి దృక్పథం ఏంటనేది ఆలోచించాలని కోరారు. పార్టీల సిద్ధాంతాలు, ఎవరి కోసం పనిచేస్తాయనేది ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఈ అంశాలపై ప్రజలు చర్చించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఈ ఓటు అని అన్నారు. నాయకులు.. కళ్ల ముందు జరిగిన చరిత్రను వక్రీకరిస్తారు. ఏది నిజమో తెలిసిన తర్వాతే ప్రజలు ఓటు వేయాలి అని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల కోసం అనేక కష్టాలు పడ్డాం.. ఇవాళ అన్ని సమస్యలను అధిగమించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దుకున్నాం.. వారి హక్కులను కాపాడామన్నారు.
కొండగల్ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారని, కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందంటూ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ కు, కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదని బీఆర్ఎఐస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇపుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా? అని మాట్లాడుతున్నారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తంలో 24గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిగిందన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 60లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోందన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి తెరాస కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాత వెనక్కితగ్గారన్నారు. రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించా అని సీఎం కేసీఆర్ వివరించారు.
నేడు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా వెళ్లనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెరువులో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. జిల్లాలోనే తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడం.. పోరుబిడ్డ, సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసమీకరణపై దృష్టి సారించిన పాలేరు ఎమ్మెల్యే, అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాళ.. సీఎం సభకు ప్రజలు, లబ్ధిదారులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ తొలి సభ నిర్వహిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
హైదరాబాద్ ఆమీర్ పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు… సనత్ నగర్ నియోజకవర్గ BRS MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమాన్ని మంగళ హారతులు పట్టి, నుదుటన తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు పలువురు మహిళలు. చరిత్రలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు 10 సంవత్సరాలలో చేశామన్నారు. ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికీ మరురవలేనన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించే మొదటి ఐదుగురిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉండాలని నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ హలీ వరంగల్ కు వెళుతూ మధ్యాహ్నం జనగాంలో ఆగి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జమా మసీదులో ప్రార్థన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలవుతున్నాయని చెప్పారు.




Total views : 149185