జగిత్యాల, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, జగిత్యాలలో 254 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని జగిత్యాల ఆర్డీవో, రిటర్నింగ్ అధికారి నరసింహమూర్తి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించడానికి 1200 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని, 178 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, ఓటర్ స్లిప్ తో పాటు 12 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో ఐదు ఉమెన్ పోలింగ్ స్టేషన్లు, ఒక పిడబ్ల్యూడిపోలింగ్ స్టేషన్, యూత్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం జగిత్యాల డిఎస్పి వెంకట్ స్వామి మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో, డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నటేష్, ఎస్ఐలు, పోలింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Cvr news telugu
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య మంత్రిని విమర్శించే స్థాయి టిడిపి జనసేన నాయకులకు లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి స్థానిక టిడిపి మాజీ ఎమ్మెల్యే హేమలత జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ లు ఇరువురు నోరు అదుపులో పెట్టుకుని ముఖ్యమంత్రి గురించి అవాకులు చవాకులు పేలితే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక మండల పరిధిలోని పెద్ది ఈటిపాకం పంచాయతీలో జగనన్నే మళ్లీ సీఎం కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి విద్యాదేవన వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూలు అభివృద్ధి ఆసరా చేయూత రైతులకు వడ్డీలు లేని రుణాలు ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల నిధుల్ని ముఖ్యమంత్రి జగనన్న బటన్ నొక్కి నేరుగా అర్హులైన వారి ఖాతాల్లోకి వేస్తున్నారంటూ ఆయన అన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయంలో సత్యవేడు అభివృద్ధికి ఏమి చేశారో టిడిపి నాయకులు బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన డిమాండ్ చేశారు. టిడిపి పార్టీ శ్రేణులకు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సీఎం జగనన్నను సైకో అంటూ విమర్శలు చేయడం తప్ప ఇంకేమీ చేతకావంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 2024 ఎన్నికల్లో ప్రజల అండదండలతో భారీ మెజార్టీ గెలుస్తారని ఆయనే మళ్లీ సీఎం అవుతారంటూ ఆయన పేర్కొన్నారు.
రేపు పోలింగ్ జరిగే ఎన్నికల సిబ్బందికి ఈ రోజు ఎన్నికల సామగ్రిని అందించడం జరిగింది, ఎన్నికలు జరిగే పోలింగ్ స్టేషన్లకి ఈవీఎం మిషిన్లతో పాటు ఎన్నికల సిబ్బంది కూడా చేరుకోవడం జరుగుతుంది, మన గజ్వెల్ నియోజకవర్గంలో 321 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఎన్నికల పోలింగ్ స్టేషనులను చూసుకోవడానికి 321 మంది ప్రొసీడింగ్ ఆఫీసర్లు అలాగే అడిషనల్ పోలింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది 642 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేసాము, 202 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించాము అందులో లైవ్ వెబ్ పోస్టింగ్ 124 మైక్రో అబ్జర్వర్ లను ఏర్పాటు చేసాము, పోలింగ్ స్టేషన్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు, పోలింగ్ స్టేషన్లో ఓటర్ సహాయక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాము, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వన్ ప్లస్ వన్ అలాగే 800 నుండి 900 మంది పోలీసు సిబ్బందిని మొత్తంగా ఏర్పాటు చేసాము.
శ్రీ సత్య సాయి జిల్లా రోద్దం మండలం లో త్రీవ విషాదం చోటుచేసుకుంది. రెడ్డిపల్లి కట్ట పైన టూ వీలర్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. కూతురికి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని తండ్రి, కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి పేరు పనిధర్ రెడ్డి కూతురు ఘవిత. పనిందర్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు నరసింహారెడ్డి రోద్దం మండలం రెడ్డిపల్లి గ్రామం.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలకోసం ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. 273 పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికల ప్రక్రియ జరగనుండగా, 233733 మంది ఓటర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ సామగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ప్రొసీడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్ తో పాటు ముగ్గురు పోలింగ్ అసిస్టెంట్లను నియమించడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారికి తెలిపారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు, 100 మీటర్ల పరిధిలో ఎవరిని అనుమతించమని తెలిపారు. ఓటర్లు తమ ఓటును నిర్భయంగా తమకు నచ్చిన వారికి ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు.
Read Also..
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. భాగంగా మునుగోడు నియోజకవర్గం లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల సామాగ్రి అంత ఈరోజు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళుతుంది. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలోనే అధికారులు నిమగ్నమై ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం లో మొత్తం 39 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 2,52,648 ఓటర్లు కలరు. పురుషులు 1,26,223
మహిళలు 1,26,421 ట్రాన్స్ జెండర్స్04 ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా 207 పోలింగ్ ప్రదేశాలు కలవు, 307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సమస్య ఆత్మక పోలి కేంద్రాలుగా 112 గుర్తించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మహిళా పోలింగ్ కేంద్రాలు 5, మోడల్ పోలింగ్ కేంద్రాలు 5,యూత్ కేంద్రం 1. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 30 రూట్స్ ఏర్పాటు చేశారు ప్రతి రూటుకి నలుగురు చొప్పున మొత్తం 1,228 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. 201 వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్ 71మెంబర్స్,ఎక్స్ సర్వీస్ మెంబర్స్ 51 మెంబర్స్ నియమించారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఐదు అంచల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది పైగా పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈవీఎంలు తీసుకెళ్లి రూట్ బస్సులకు జియో ట్యాబ్లెట్ ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 1300 మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారు. 550మంది ఎన్నికల నిర్వహిస్తున్న అధికారులు ఉపయోగించుకున్నారు.
తిరుపతి బహిరంగసభ ( Public Meeting ) :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, రేపు నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 62064