ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా ముఖ్యం. అవును నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏకాగ్రత, శ్రద్ధ, నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అందుకే రాత్రిపూట కనీసం ఏడు గంటల పాటైనా నిద్రపోయేలా చూసుకోండి. మీరు సరిగ్గా నిద్ర లేకపోతే ఉదయం లేచిన వెంటనే చిరాకు కలుగుతుంది. ఆ రోజంతా మీరు చిరాకుగానే ఉంటారు. అలాగే ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైనవి వచ్చే అవకాశం కూడా ఉంది. నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన రోగాలేమీ రాకూడదంటే మీరు కంటినిండా నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల కూడా ఎన్నో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది కూడా మీ చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల మీ చర్మం పొడిబారడం, ముడతలు పడటం, తామర వంటి చర్మ సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే మీ ఇమ్యూనిటీ పవర్ పై ప్రభావం పడుతుంది. తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా మీకు ఎన్నో వ్యాధులు, అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడతారు. నిద్ర లేకపోవడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల మీ ఆకలి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఆకలి, అనారోగ్యకరమైన ఆహారం కోసం మీలో కోరికలను పెంచుతుంది. దీంతో మీరు విపరీతంగా తిని బాగా బరువు పెరుగుతారు.
diseases
నాగారం మండలం ప్రగతి నగర్ సమీపంలోని రఘురామ రైస్ మిల్లు నుండి వెలువడే పొగ, దుమ్ము, దూళితో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మా గోడును ఎన్నిసార్లు వెల్లపుచ్చుకున్న పట్టించుకోకుండా మా ప్రాణాలతో చెలగాటమాడుతున్న రైస్ మిల్ యజమాన్యంపై కాలుష్య నివారణ బోర్డు నియమ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మిల్లు నుండి వెలువడే కాలుష్య వ్యర్ధాలు రాకుండా అరికట్టాలని ప్రశ్నించిన మాపై మహిళలని కూడా చూడకుండా చెప్పుతో కొడతానని దుర్భాషలాడి మీకు చేతనైనది చేసుకోమని, బెదిరింపులకు గురి చేస్తున్నారని, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నిండు వెలువడే కాలుష్యంతో కంటిచూపు సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ 30 నుంచి 50 వేల రూపాయలు హాస్పటల్ కు ఖర్చు చేశామని అయినా ఆరోగ్యం కుదట పడడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రఘురామ రైస్ మిల్లు నుండి వెలుపడే కాలుష్యాన్ని నివారించి మాకు న్యాయం చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు.
ఆత్రేయపురపు వంగ, ముండ్ల వంగ, కస్తూరి వంగ, నీటి వంగ, గుత్తి వంగ ఇలా రకరకాల వంకాయలు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వంకాయలతో ఎన్నో రకాల వంటలు చేస్తారు. అనేక అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వంకాయలో విటమిన్లు, ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వంకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే వంకాయలను వారంలో కనీసం రెండు సార్లు అయినా తింటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వంకాయల వల్ల మరో ప్రయోజనం ఏంటంటే. శరీరంలో కొవ్వులను కరిగించే శక్తి వీటిలో సమృద్ధిగా ఉంది.బరువు తగ్గాలనుకునేవారు ఖచ్చితంగా వారంలో రెండు సార్లు వంకాయలను తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేవిధంగా, వంకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే రిస్క్‌ను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో షుగర్ లెవల్స్‌ను కూడా వంకాయలు కంట్రోల్ చేయగలవు.
కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. గుండె నొప్పులు తగ్గుటకు జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది.
ఎలర్జీకి తగ్గుటకూ శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర – చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. గర్భాశయ బాధలు తగ్గుటకు జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి. మూత్ర సంబంధ వ్యాధులకు జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. నీరసము తగ్గుటకు ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు+ జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది. పేగులు శుభ్రపరచుట ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు. పైత్యరోగాలకు జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన , సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే … తలతిప్పు , కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును. తేలుకుట్టుకు జీలకర్ర , తేనె , ఉప్పు , నెయ్యి కలిపి నూరి తేలుకుట్టిన చొట కట్టు కట్టిన తేలు విషము హరించును. నీళ్ళవిరోచనాలు తగ్గుటకు అరతులము జీలకర్ర ఇనుమూ గరిటె లో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి … చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి. వాంతులు తగ్గుటకు వేయించం జీలకర్ర తో సమముగా సైంధవలవణము కలిపి నూరి .. సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచము గా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. బరువు తగ్గడానికి ఎక్కువ మంది గ్రీన్ టీ తీసుకుంటున్నారు.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే రోజంతా ఉత్సహంగా గడుపుతారు.గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తీసుకోవడంవల్ల సులభంగా బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.మధుమేహంతో బాధపడేవారు ఒక కప్పు గ్రీన్ టీని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.. రోజుకు ఒకటి లేదంటే రెండుసార్లు మాత్రం గ్రీన్ టీని తీసుకోవాలి. అప్పుడే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.





Total views : 62168