బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారి తుఫాన్ గా మారబోతున్న నేపథ్యంలో అపరమతమైన జిల్లా యంత్రాంగం. అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ హరి నారాయణ. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 1077ఏర్పాటు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్…, ప్రస్తుతం నెల్లూరుకి 860 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తుఫాన్ గా మారే అవకాశం. తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్ష ప్రాంతాలు తరలించుకు రంగం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం…
heavy rain
సూళ్లూరుపేట నియోజకవర్గంలో దొరవారిసత్రం, తడ, మరియు సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో ఈ ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఓ మోస్తారు వర్షం. ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఇకనైనా సూళ్లూరుపేట మున్సిపాలిటీ అధికారులు, మరియు పాలకులు గుంతలుగా మారిన రోడ్లని మరమ్మత్తులు చేపిస్తే వాహనదారులకు, మరియు పాదచారులకు మేలు చేసిన వారు అవుతారని ప్రజలు కోరుకుంటున్నారు..
తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ తో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, బార్కాస్, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగిర్, మణికొండ, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని తెలిపింది.
నాగులప్పలపాడు మండలం ఓమ్మెవరం గ్రామానికి చెందిన గోగినేని హనుమంతరావు వయసు 43 సం అను అతను దరిశి గ్రామంలో ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తూ ఈరోజు ఉదయం తన విధులకు వెళ్ళుటకు ఓమ్మెవరం గ్రామం నుండి దరిశికి వెళుతూ నాగులుప్పలపాడు మండల పరిధిలోని హనుమాపురం కొత్తకోట గ్రామం సమీపంలో గల దొండవాగు వద్ద వాగు ఉదృతికి కారులో ప్రయాణిస్తున్న గోగినేని హనుమంతరావు కారుతో సహా వాగులో కొట్టుకొని పోయినాడు అంతట సదరు హనుమంతరావు చిల్ల చెట్లు పట్టుకొని నీటిలో చెట్టు సహాయంతో క్షేమంగా ప్రస్తుతం నీటిలోనే చెట్లలో ఉన్నాడు. ఫైర్ సిబ్బంది వచ్చి అతని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయుచున్నారు.
Read Also..
పచ్చని తోటలతో ఆహ్లాదకరంగా ఉండే కోనసీమలో రోడ్ల పరిస్థితి మరి దయనీయంగా ఉంది. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తున్న పి గన్నవరం నియోజకవర్గంలో చాలాచోట్ల రోడ్ల పరిస్థితి చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి. రోడ్ల పరిస్థితి అద్వానంగా తయారవడంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి రోడ్లపై ప్రయాణించాలంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో నని ప్రజలు భయపడుతూ తమ ప్రయాణాలను సాగిస్తున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల్లోనే రాష్ట్రంలో రోడ్లన్నీ పూర్తిగా నిర్మిస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్న కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం లగ్జరీ కార్లలో తిరిగే ఎమ్మెల్యే కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా టెండర్లు వరకు వస్తున్న ప్రక్రియ రోడ్ల నిర్మాణం వరకు ఎందుకు రావట్లేదో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యే కమీషన్ కుదరకన లేక కాంట్రాక్టర్లు భయపడి ముందుకు రాకన లేక ప్రభుత్వం నుండి నిధులు రాకన అనేది ఎవరికి అర్థం కావట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే మామిడికూదురు మండలం పాసర్లపూడి ప్రధాన రహదారిలో లోడు తో వెళ్తున్న లారీ గుంతల మాయంగా ఉన్న రోడ్డులో అదుపుతప్పి తిరగబడిపోయింది. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ మిగిలిన 6 నెలలో కాలంలోనైనా రోడ్ల నిర్మాణం చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో భారీ వర్షం కురడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. అకాల వర్షంతో ప్రయాణికులు, మార్కెట్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో చిన్నపాటి వర్షానికి నరసాపురం పట్టణంలో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి రహదారులపై వర్షపు నీరు నిలవకుండా తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.




Total views : 56906