పవిత్ర కార్తీక మాసోత్సవాలు చివరి దశకు, చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణలతో మారుమోగాయి. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దేవాలయాలకు చేరుకోగా, వేద పండితులు స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళా భక్తులు దేవస్థాన ప్రాంగణంలో స్వామివారికి కార్తీకదీప పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఆశీస్సులతో కార్తీక మాసోత్సవ వేడుకలు విజయవంతంగా ముగుస్తున్నాయని దేవదాయ శాఖ అధికారి నటరాజన్ షణ్ముగం అన్నారు.
karthika pournami
పవిత్ర కార్తీక మాసం అందున కార్తీక పౌర్ణమి సోమవారం కావడంతో కొత్తపేట నియోజకవర్గం లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువలో పుణ్య స్నానాలు ఆచరించారు. రేవు ఆవరణలో మహిళలు అరటి డొప్పలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి పూజలు చేసి కాలువలో వదిలారు. మరో ప్రక్క ఓంకార నాదంతో శివాలయాలు మార్మోగాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు సమీపంలో గల శైవ క్షేతాలకు వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయం నందు తెల్లవారుజామునుండే స్వామి దర్శనం కొరకు శివాలయం నందు బారులు తీరారు.అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.ఓ ప్రక్క భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివ నామస్మరణతో మార్మోగించారు.కార్తీక దీపాలతో మహిళల సందడి ఎక్కువైంది.స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలు నిర్వహించుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో 20 రూపాయలు ప్రత్యేక దర్శనం తో పాటు ఉచిత దర్శనం దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ భమిడిపాటి దుర్గా లక్ష్మినారాయణ, దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారిని పొన్నం ప్రభాకర్ దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆరు గ్యారెంటీల అమలుపై సంతకం చేసి, అఫిడవిట్ తో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై మేనిఫెస్టోను పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ కు మెడికల్ కళాశాల రాబోతోందని, హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లు ఇస్తామని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలోని కాలువల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపిస్తామన్నారు. రాష్ట్రంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
కడప జిల్లా.. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రొద్దుటూరు లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ ఆగస్తేశ్వర ఆలయం, పెన్నా నది తీరాన రెండవ కాశీగా పేరుగాంచిన శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయాలలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శివ సన్నిధిలో బారులు తీరారు. మహిళలు ఎంతో నిష్టతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు చేశారు. గర్భాలయంలోని శివ లింగానికి ఏకవార రుద్రాభిషేకం, ఉత్సవమూర్తులకు అభిషేకం, రుద్ర హోమం నిర్వహించారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కార్తీక మాస పౌర్ణమి సోమవారం పర్వతనాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా సాగర సంగమం, సముద్ర తీరం భక్తజన సందోహంగా మారింది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం భక్తులతో తిక్కిరిసింది. సముద్ర తీరానికి సుదీర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి సముద్రునికి నమస్కరించి ప్రత్యేక పుణ్య స్థానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతోసముద్రవద్ద భక్తులు కు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోడూరు నుంచి సాగర సంగమం వద్దకు వెళ్లే రహదారి పూర్తిగా శిధిల వ్యవస్థ చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రుక్మిణి సత్యభామసమేత వేణుగోపాలస్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Read Also..
కుప్పం పాతపేటలోని సోమేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి, గుడిపల్లి మండలంలోని మల్లప్ప కొండపై వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామికి కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం అనంతరం వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు మరియు మహిళలు తరలివచ్చి ఆలయం వాకిట్లో దీపాలు ఏర్పాటు చేసి తమ మొక్కులు తీర్చుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్లలో కార్తీక పౌర్ణమి మహా పర్వదినం పురస్కరించుకుని ఆదివారం జ్వాలతోరణం కార్యక్రమం మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శూలాల సంబరం ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామివారిని అమ్మవారిని పల్లకిలో ఉరేగిస్తూ ఆలయ ఆవరణలో జ్వాలతోరణం జరిపారు. అధికసంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు దీపాలు వెలిగించుకొని పూజలు జరిపారు. నూతన వధువులు పింది, పండు తాంబూలాలు స్వామి వారికి సమర్పించుకున్నారు. ఆలయ చైర్మన్ శ్రీ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వాహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఐ పోలవరం పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. అనంతరం అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం జరిపారు.
Read Also..
తిరుపతి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కైలాసంగా పిలవబడే శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీకమాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాత్రికి ఆలయంలో ఘనంగా చొక్కాని మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుండి ఆలయంలో చొక్కాని జరుగు ప్రాంగణంలో ఆలయ వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి అనంతరం గణపతి పూజ పుణ్యావచనం చేసి వివిధ పుష్పాలతో వేదమంత్రాల నడుమ హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో KS రామారావు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు అధికారులు పాల్గొన్నారు.





Total views : 147270