కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీల వర్షం కురిపించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తామన్నారు. జనవరిలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. అలాగే రేషన్ కార్డులపై సన్నబియ్యం కూడా ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఐదు లక్షల భీమా అందిస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ దశలవారీగా ఐదు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు.
Kcr
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నాంపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మన దేశ సంస్కృతి ఇది కాదన్నారు. కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగిందన్నారు. కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుందని ఆరోపించారు. అవినీతిపరుడైన కేసీఆర్పై ఒక్క కేసు కూడా లేదన్నారు. మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజల సర్కార్ వస్తుందని రాహుల్ చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి చేయకుండా తాను గద్దినెక్కాడని తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, 9 ఏళ్ల క్రితం రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్నావు చేసావా, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కల్పించారా అంటూ సిఎంని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేసారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాటలు చెప్పే మనిషే కానీ మాట మీద నిలబడే మనిషి కాదని దళితున్ని ముఖ్యమంత్రి ని చేస్తానని చెప్పి తానే తొమ్మిది ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిని అనుభావిస్తున్న మాటకరని రాష్టంలో ఉన్న నిరీద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తన కుటుంబ సభ్యులకు పదవులను కట్టబెట్టిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఈరోజు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ఉచిత కరెంట్ వస్తుందంటే అందులో తన పాత్ర ఉందని ఆనాడు రైతులకు అదనంగా కరెంట్ చార్జీలు వసూలు చేస్తుంటే రైతు సమస్యలపై పోరాడి కొట్లాడి రైతన్నలకు ఉచిత కరెంట్ కల్పించిన ఘనత నాది అన్నారు. వందలాది మంది యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పిట్టల్లా చనిపోతుంటే చూడలేక మంత్రి పదవిని సైతం రాజీనామా చేశాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో నాపాత్ర ఉందని ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. గత 19 యేండ్లుగా నియోజకవర్గంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నేడు మీరు చూస్తున్న ప్రాజెక్టులు రైతు బంధు రైతు భీమా నీటి కాలువలు పెంక్షన్లు సీసీ రోడ్లు కరెంట్ ప్రభుత్వ భవనాలు ఇలా చెప్పుకుంటు పోతే నేడు మీరు చూస్తున్న అభివృద్ధి నేను చేసిన అభిద్దే అన్నారు. ప్రజలు తెలంగాణ రాష్టంని ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాదని వేరే పార్టీలకు ఓటు వేస్తే మళ్ళీ ఇక్కడి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నే గెలుస్తాడు అన్నారు. పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలకోసం శ్రామిస్తానని కాంగ్రెస్ పార్టీని నన్ను మళ్ళీ ఒకసారి ప్రజలు అదరించి 30 న జరిగే ఎన్నికల్లోఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
Read Also…
Read Also…
పదేళ్ళలో ఎమ్మెల్యేగా తాను చేసిన పనిని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని కూకట్పల్లి బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రచారానికి చివరి రోజు కావడంతో నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేలా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూకట్పల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేసే ముందు ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టాలని కోరారు. మల్కాజ్గిరి నుండి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, స్థానికుడైన తనకు పరిష్కరించిన, పరిష్కరించాల్సిన సమస్యల పై పూర్తి అవగాహన ఉందని, బయట నుండి వచ్చిన వారికి నియోజకవర్గం పై అవగాహన కూడా లేదని, ఓటు వేసే ముందు అన్ని విధాలా ఆలోచించి అభివృద్ది, శాంతి భద్రతలతో మతసామరస్యాన్ని కాపాడుతున్న బిఆర్ఎస్ పార్టీ.ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకున్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు బోయిన్పల్లిలోని కార్పొరేటర్ ముద్దమ్ నరసింహ యాదవ్ తో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా యువత భారీ ఎత్తున హాజరై బైక్ ర్యాలీ నిర్వహిస్తూ గల్లి గల్లి కి బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చూపుతూ ముందుకు సాగారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేవలం ఒక్కరోజు మాత్రమే గడువున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు …హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా అందరం అన్నదమ్ముల వలె ఇక్కడ నివసిస్తున్నామని.. తిరిగి మళ్ళీ ఇదే ప్రశాంతమైన జీవనం కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటు వేయాలని తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళదామని కోరారు…
Read Also…
Read Also…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని, కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని, తనకు మరే పార్టీతో ఇప్పుడు సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తగా నిబద్ధతతో పని చేస్తున్నానని చెప్పారు. అవసరమైతే ఏపీలో కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని అన్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు.
గడిచిన నలభై ఏళ్లుగా గుర్తురాని అమ్మగారి ఊరు కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇన్నేళ్లలో గల్ఫ్ కార్మికుల గోసను ఏనాడూ ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు కేసీఆర్ కు తీరికే దొరకలేదని అన్నారు. ఇప్పుడు ఆయన కామారెడ్డికి వచ్చింది ప్రజల కోసం కాదని, ఇక్కడున్న భూములను కాజేసేందుకే వచ్చాడని ఆరోపించారు.
పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను వేటాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలని కామారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారలోకి వస్తే.. తొలి మంత్రి వర్గ సమావేశంలో అసైన్డ్ భూముల పట్టాలపై సంతకం చేస్తానని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా రైతు బంధు రూ. 16 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.1956 లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, అప్పుడు రాష్ట్రాన్ని ఆంధ్రలో కలపటం వల్ల 50 ఏళ్లు ఎన్నో గోసలు పడ్డామని గుర్తుచేశారు. గులాబీ జెండా పట్టి అందరం పోరాడితే 2004లో తెలంగాణ ప్రకటించారని, అప్పుడు ప్రకటించినా తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. తాను ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నాకనే కాంగ్రెస్ పార్టీ దిగివచ్చిందని గుర్తుచేశారు. మరోవైపు ధరణి పోర్టల్లో రైతుల వేలిముద్ర లేకుండా భూ రికార్డులను సీఎం కూడా మార్చలేరని, ధరణితో రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయని చెప్పారు.
కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిసి KPHB లో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని.. ప్రతినిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా గత పదిఏళ్ల నుంచి వేలకోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చామని నేడు ఎక్కడెక్కడ నుండో వచ్చి కనీసం కూకట్పల్లి నియోజకవర్గంలో ఏ గల్లి ఎక్కడ ఉంటుందో కూడా తెలియని వారు.. నియోజకవర్గ పరిది తెలియని వారు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని.. దీనిని ప్రజలు గమనించాలని కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి చూసి ఓటు వేయాలని అన్నారు.. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ అలాగే ఎంతోమంది ఉద్యోగాలు చేసుకునేవారు అన్ని మౌలిక సదుపాయాలతో సుఖసంతోషాలతో జీవిస్తున్నారని దీనంతటికీ కారణం బిఆర్ఎస్ పార్టీ తీసుకున్న విధానాలే కారణమని అన్నారు. అందుకని రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా అందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.నే డు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఇదంతా మంత్రి కేటీఆర్ చొరవనేనని దీనిని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా గుర్తించాలని కోరారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కేవలం పదేళ్ల కాలంలో ఎన్నో ఫ్లైఓవర్లు.. అండర్పాస్ బ్రిడ్జిలు నిర్మించామని ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా ప్రక్షాలించడానికి ఇంకా అనేక చర్యలు తీసుకున్నామని ఇవన్నీ కొనసాగాలంటే శాంతిభద్రతలు.. హైదరాబాద్ మహానగరంలో ఉండాలంటే కచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని అన్నారు. అలాగే తనకు కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గడిచిన నలభై ఏళ్లుగా గుర్తురాని అమ్మగారి ఊరు కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చిందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇన్నేళ్లలో గల్ఫ్ కార్మికుల గోసను ఏనాడూ ఆయన పట్టించుకోలేదని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు కేసీఆర్ కు తీరికే దొరకలేదని అన్నారు. ఇప్పుడు ఆయన కామారెడ్డికి వచ్చింది ప్రజల కోసం కాదని, ఇక్కడున్న భూములను కాజేసేందుకే వచ్చాడని ఆరోపించారు.
పేదల రక్తం రుచి మరిగిన కేసీఆర్ ను వేటాడేందుకే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో బొందపెట్టాలని కామారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also..
Read Also..
కేసీఆర్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు బంధు పంపిణీకి అడ్డుకట్ట వేసింది. దీంతో రైతుల ఖాతాల్లో వేయడానికి సిద్ధమైన సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ అన్నదాతలకు రైతు బంధు పంపిణీకి రెండు రోజుల క్రితం సీఈసీ అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం సర్కారుకు అనుకూలమన్న విమర్శలు వచ్చాయి. కేంద్రం ఒత్తిడితోనే సీఈసీ రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. తెలంగాణ ఎన్నికల్లో రైతుబంధు చుట్టూ రాజకీయం అల్లుకుంది. అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగింది. కేసీఆర్ సర్కారు సీజన్ వారీగా రైతులక పెట్టుబడి సాయం అందిస్తోంది. తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి 7,700 కోట్ల రూపాయలు జమ చే్స్తోంది. తెలంగాణలో ఎక్కువగా ఉన్నది రైతుల ఓట్లే. పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ఒకటిక కాదు, రెండు కాదు… ఏకంగా 7,700 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లున్నాయనగానే బీఆర్ఎస్ లో ఆనందం, కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమైంది. ఇది కచ్చింతంగా తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందింది. తెలంగాణలో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరిన ఈ సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ తమదే అధికారం అనే ధీమాతో ఉంది. ఈ సమయంలోనే దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుమతి లభించడంతో ఎన్నిక కీలక మలుపు తిరుగుతుందని భావించారు. ఈ నిధులను ఈనెల 28లోగా జమ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే కాంగ్రెస్ లో ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. ఈ సమయంలో ఏకంగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ అంశం కొత్త చర్చకు దారి తీసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందనే ప్రచారం వేళ ఈ నిధుల విడుదల ద్వారా ఏం జరుగుతుందనేది కీలకంగా మారింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు విషయంలో పునరాలోచన చేసింది. ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంది.




Total views : 90073