పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పిల్లల ఆశ్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే ఆశ్రమం లోని పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఆశ్రమానికి అవసరమైన ప్రధాన గేటు ఏర్పాటుతో పాటు పిల్లల కోసం టాయిలెట్స్ ను నిర్మించినట్లు ఆమె పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనేక పోరాటాలు చేసిన బండి సంజయ్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు సంధ్యారాణి తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు,…
- ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ఐ బొమ్మ”. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్…
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
- సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
- భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి