బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నియంత్రణ కోల్పోయింది. దాంతో తిరిగి గాల్లోకి ఎగిరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను తమిళనాడు తీరాన్ని తాకింది. తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో అత్యంత భారీవర్షాలు కురుస్తున్నాయి. గాలుల, కుండపోత వర్షాల కారణంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వర్షాల ఉద్ధృతి పెరగడంతో కొన్ని గంటలు విమానాశ్రయాన్నే మూసేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగుపడిన తర్వాత ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా దర్శకత్వంలో వర్ధన్ మయూర్ కొయ్యాడ సినిమాటోగ్రాఫర్ గా ప్రారంభమైన చిత్రం లఫూట్ గ్యాంగ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ ఈ చిత్రానికి సంగీతం…
- ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.…
- రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు… మొదట అది సాధారణ ప్రమాదంగా కనిపించింది. కానీ, కాసేపటికే బయటపడిన నిజాలు పోలీసులను సైతం షాక్‌కు గురిచేశాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లా సమీపంలో మాజీ సర్పంచ్‌తో పాటు నలుగురిని…
- పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది. జిల్లాలో పండిన వరి పంట, కొనుగోలు పరిస్థితులపై అధికారులు, రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకుంది. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు, అనంతరం…
- సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి, దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 89090