Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Latest News ఫెయింజల్ తుఫాన్ ఎఫెక్ట్.. అదుపు తప్పిన ఇండిగో విమానం

ఫెయింజల్ తుఫాన్ ఎఫెక్ట్.. అదుపు తప్పిన ఇండిగో విమానం

by Rama
ఫెయింజల్ తుఫాన్ ఎఫెక్ట్.. అదుపు తప్పిన ఇండిగో విమానం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్‌ తుఫాను ప్రభావంతో తమిళనాడులో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌బస్‌ విమానం ల్యాండ్‌ అవ్వడానికి ప్రయత్నించగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నియంత్రణ కోల్పోయింది. దాంతో తిరిగి గాల్లోకి ఎగిరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్‌ తుపాను తమిళనాడు తీరాన్ని తాకింది. తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో అత్యంత భారీవర్షాలు కురుస్తున్నాయి. గాలుల, కుండపోత వర్షాల కారణంగా సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వర్షాల ఉద్ధృతి పెరగడంతో కొన్ని గంటలు విమానాశ్రయాన్నే మూసేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగుపడిన తర్వాత ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉదయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.
    కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా..ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్‌లో పోస్టర్లు వెలిశాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్…
  • దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..
    సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని…
  • పూణేలో కూలిన శిక్షణ విమానం..
    మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
  • సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…
    కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
  • విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..
    తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

012372
Total views : 74855

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.