బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య హాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని, దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిపై తుఫాను విరుచుకుపడింది. భారీ వర్షాలు, వరదలతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. తమిళనాడులో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలి, కోవూరు, నెల్లూరు, సూళ్లూరుపేటలో వర్షాలు పడుతున్నాయి. కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో మెరైన్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212593