Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News తీరం దాటిన ఫెయింజల్ తుపాన్

తీరం దాటిన ఫెయింజల్ తుపాన్

by Rama
తీరం దాటిన ఫెయింజల్ తుపాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య హాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని, దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిపై తుఫాను విరుచుకుపడింది. భారీ వర్షాలు, వరదలతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. తమిళనాడులో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కావలి, కోవూరు, నెల్లూరు, సూళ్లూరుపేటలో వర్షాలు పడుతున్నాయి. కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో మెరైన్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్ల దందా.
    ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సరైన అనుమతులు లేకుండానే రియల్టర్లు వెంచర్లు వేసి.. ప్లాట్స్ అమ్మేస్తున్నారు. ప్రజల కష్టాన్నీ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఒంగోలులో ప్లాట్స్ ప్రీలాంచ్ ఈవెంట్ నిర్వహించిన శ్రీభ్రమర…
  • నిర్మల్ జిల్లా భైంసాలో ప్రైవేట్ పాఠశాలలపై ఎబివిపి నేతల ఆగ్రహం.
    నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారంపై ఎబివిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలపై పోరాటం చేస్తున్న తమపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.…
  • కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి ట్రిపుల్ ఐటీలకు ఎంపిక.
    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో సత్తా చాటారు. నియోజకవర్గం నుంచి ఏకంగా 39 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో…
  • మెట్రోస విస్తరణను బీఆర్‌ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి-సీఎం రేవంత్‌రెడ్డి.
    మెట్రో విస్తరణను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మెట్రో విస్తరణ జరిగేచోట బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారని తెలిపారు. సమస్యలపై మాట్లాడదామంటే కేంద్రమంతి కిషన్‌రెడ్డి సమయం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుని…
  • రూ.33 లక్షల బకాయిల కోసం పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్.
    మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే ప్రధాన గేటుకు కాంట్రాక్టర్ రామనాథం తాళం వేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గేటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023974
Total views : 143657

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.