టీ20 అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర లిఖితమైంది. బ్రెజిల్ మహిళల జట్టు కెప్టెన్ లారా కార్డోసో అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించింది. బీసీఏ కలహారీ మహిళల టీ20ఐ టోర్నమెంట్ 2026లో భాగంగా లెసోతోతో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. కార్డోసో కేవలం 3 ఓవర్లు బౌలింగ్ చేసి, 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 9 వికెట్లు పడగొట్టడం విశేషం.
ఈ అద్భుత ప్రదర్శనతో, పురుషులు, మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన తొలి క్రీడాకారిణిగా లారా కార్డోసో నిలిచింది. ఇంతకుముందు పురుషుల టీ20ల్లో సోనమ్ యేషే (8/7), మహిళల క్రికెట్లో రోమాలియా (7/0) పేరిట ఉన్న రికార్డులను ఆమె అధిగమించింది. తన రెండో ఓవర్లో హ్యాట్రిక్‌తో ప్రత్యర్థి పతనాన్ని శాసించిన కార్డోసో, ఆ తర్వాత ఓవర్లలోనూ వికెట్ల వేట కొనసాగించింది. ఆమె ధాటికి లెసోతో జట్టు కేవలం 6.2 ఓవర్లలో 13 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బ్రెజిల్ జట్టు, రాబర్టా ఏవరీ (48), మోనిక్ మచాడో (69 నాటౌట్) రాణించడంతో 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లెసోతోను స్వల్ప స్కోరుకే కట్టడి చేసి 189 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో బ్రెజిల్ జట్టు ఆద్యంతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతోంది. గతంలో జాంబియాపై జరిగిన మ్యాచ్‌లోనూ 174 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో జాంబియాను 26 పరుగులకే ఆలౌట్ చేయడంలో మరియా రిబేరో 5 వికెట్లతో, కార్డోసో 3 వికెట్లతో కీలకపాత్ర పోషించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ బ్రెజిల్ ఈ టోర్నీలో బలమైన శక్తిగా నిలుస్తోంది.
Tag:
#record
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం మాస్క్ నికర సంపద 334.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది
యూఎస్ ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు ఏకంగా 40శాతం వరకు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజే టెస్లాకు చెందిన షేర్ విలువ 3.8 శాతం పెరిగింది. దీంతో 334.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ కుబేరుడిగా మస్క్ రికార్డు సృష్టించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
- అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
- శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్ఇన్స్పెక్టర్ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
- ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్మీట్లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ…
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి