పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంకా పంపిణీ చేయాల్సి ఉన్న 211 పాస్‌బుక్‌లను త్వరలోనే అందజేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ల సంక్షేమం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా జగన్నపేట గ్రామానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటివరకు నియోజకవర్గంలోని పేదలకు సుమారు రూ.8 కోట్ల ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, జగన్నపేటలో రూ.4 కోట్లతో రహదారులు నిర్మించామని, కడియద్దతో పాటు ఇతర గ్రామాల రోడ్ల పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.
Tag: