తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోంది. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది.
#telangana
గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి కేటీర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడో.. ఇక్కడో ఎమ్మెల్యేలపై చిరు కోపం ఉన్నా… కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందన్నారు. బీఫారాల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్.. ఫలితాల్లోనూ ముందే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 40చోట్ల అభ్యర్థులు లేరని, బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని విమర్శించారు. భాజపా అభ్యర్థులు ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారన్నారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు 24వేలు అని చెప్పిన కేటీఆర్.. అందులో తెలంగాణ వాటా 10వేలని వివరించారు.
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశాం ముగిసిందని, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు. అభ్యర్థల గురించి చర్చ జరిగిందిని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు. అయితె అభ్యర్థులపై ఇంకో సమావేశాం జరిగే అవకాశం ఉందని థాక్రే అన్నారు. రెండవ జాబితాలో మిగతా అన్ని స్థానాల అభ్యర్ధులను ఖరారు చేయాలని అనుకుంటున్నామని, తదుపరి కాంగ్రెస్ సీఈసీకి జాబితా పంపిస్తామన్నారు. అవసరమైతే స్ర్కినింగ్ కమిటీ భేటీ అయ్యి…స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని మానిక్ రావు థాక్రే అన్నారు. వీలైనంత త్వరలో సీఈసీ మీటింగ్ ఉంటుందని, కమ్యూనిస్టు పార్గీలతో చర్చలు కొనసాగుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని థాక్రే అన్నారు.