తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోస్ కోసం ఇంటర్నల్ అల్గారిథమ్‌లతో అమర్చబడి ఈ USB వెబ్‌క్యామ్ ఉందని రిలయన్స్ జియో పేర్కొంది. ఈ వెబ్‌క్యామ్ ని JioTVCalling అండ్ JioMeet అప్లికేషన్లతో ఉపయోగించవచ్చు. ఇంకా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ మొదలైన ఇతర ప్రముఖ అప్లికేషన్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. రిలయన్స్ జియో కస్టమర్లు టీవీ నుండి నేరుగా వీడియో కాల్స్ చేయడానికి JioTVCamera అనే USB వెబ్‌క్యామ్‌ని ఉపయోగించవచ్చు. Jio USB వెబ్‌క్యామ్ లాంగ్ -రేంజ్ ఆడియోతో పాటు అల్ట్రా-వైడ్ HD వీడియోను అందిస్తుంది. ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కోసం ప్రైవసీ షట్టర్‌తో కూడా వస్తుంది.
Tag:
TV
2050 నాటికి వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఇతర వస్తువులను అధిగమించి, భారతదేశంలో ఎయిర్ కండిషనర్ల సంఖ్య తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంచనా. 2010 నుంచి ఇళ్లలో వినియోగిస్తున్న ఏసీల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి 100 కుటుంబాలలో 24 కుటుంబాలు ఎయిర్ కండిషనర్ వినియోగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) రిపోర్ట్ ప్రకారం.. 2019, 2022 మధ్య కూలింగ్ స్పేసెస్ ఎనర్జీ కన్సమ్షన్ 21 శాతం పెరిగింది. అందరూ ఆర్థిక స్థిరత్వం, ఆదాయం పెరిగేకొద్దీ సౌకర్యాలు సమకూర్చుకోవడం సాధారణమే. ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది ఎయిర్ కండిషనర్లు(AC) కొనుగోలు చేస్తున్నారు.





Total views : 77905