అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి (Sujana Chowdary) పిలుపునిచ్చారు. సోమవారం 38 డివిజన్ లో సుజనా ప్రచారం చేశారు. 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు పితాని పద్మ, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు తమ్మిన లీలా కరుణాకర్, జనసేన డివిజన్ అధ్యక్షుడు నాళం ఠాకూర్ తో కలిసి పున్నమిఘాట్ , విద్యాధరపురం, కుమ్మరిపాలెం, కొట్టేటి కోటయ్య వీధి, నాలుగు స్తంభాల సెంటర్ తదితర ప్రాంతాల్లో సుజనా పర్యటించారు. సుజనాకు స్థానికులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఎన్నికల్లో వైసీపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని సుజనా పిలుపునిచ్చారు. అయిదేళ్ళ వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి విజయవాడ పశ్చిమ నియోజవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వైసీపీ కొత్త మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం అని సుజనా అభివర్ణించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
యువతకు ఉద్యోగాలు లేవు పట్టుమని పది పరిశ్రమలు రాలేదు కల్తీ లిక్కర్ తో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని హజ్ హౌస్ నిర్మాణాలను చేపట్టి అభివృద్ధికి సహకరిస్తామని వివరించారు ఎన్డీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కూటమితోనే అభివృద్ధి మరింత సాధ్యమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీ-టీడీపీ- జనసేన కూటమిగా ఏర్పడ్డాయని ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఎం ఎస్ బేగ్ , టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, మాజీ కార్పొరేటర్లు అబ్దుల్ ఖాదర్, కరిముల్లా, టీడీపీ డివిజన్ మాజీ అధ్యక్షులు సురభి బాలు సుజనాకు మద్దతుగా నిలిచారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్‌కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…




Total views : 90007