వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమె ఏపీనా లేక తెలంగాణనా అన్న చర్చ కొనసాగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టి ఆ ప్రాంతంలోనే వైఎస్ షర్మిల కార్యకలాపాలు సాగించారు. తన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో ఆమెను ఏపీకి నియమిస్తున్నారన్న ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు ఆమె ఇటీవలి వరకు తెలంగాణలోనే కదా ఉన్నారు. తెలంగాణకే పరిమితం అవుతారన్న అంచనాలు కూడా వచ్చాయి. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలో వైఎస్ షర్మిలపై రేవంత్ స్పష్టత ఇచ్చారు. వైఎస్ షర్మిల తమ పార్టీకి చెందిన ఏపీ నేత అని తేల్చేశారు. షర్మిల ఏపీకి చెందిన నాయకురాలని రేవంత్ కుండబద్దలు కొట్టారు.
YS Sharmila
తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని… ఇక సూట్ కేస్ సర్దుకోవడమేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు హైప్ రావడం వల్ల కేసీఆర్ ను దించే అవకాశం ఆ పార్టీకి వచ్చినందువల్ల ఆ పార్టీకి తాము మద్దతుగా నిలిచామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆత్మహత్యా సదృశం అయినప్పటికీ… కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు కాబట్టి… తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్ల అయినా కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలనుకున్నానని తెలిపారు. కేసీఆర్ పై ఎంతో పోరాటం చేసిన తర్వాత మళ్లీ ఆయనతో ఎందుకు కలిశారని ప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాలను వేడెక్కిస్తున్నాయి. ఇటీవలి పొత్తులు సరికొత్త రాజకీయ సమీకరణాలను తెరముందుకు తెస్తున్నాయి. షర్మిల తన పార్టీని పోటీ నుంచి దూరంగా ఉంచారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. తాను పోటీ చేస్తానని ప్రకటించిన పాలేరు నుంచి కూడా ఆమె పోటీకి దూరమని వెల్లడించారు. రాజకీయ పార్టీ అన్నాక పోటీలు, పొత్తులు సహజమే. కాంగ్రెస్ పార్టీకి అండగా పోటీ నుంచి విరమించడం అన్న పాయింట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్సలు నచ్చలేదు. అందుకే ఆ విషయాన్ని బాహాటంగానే వ్యక్తం చేసింది. ఆ పార్టీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా నిలదీసినంత పని చేశారు.ప్రస్తుత సీఎం, షర్మిల సోదరుడు వైఎస్ జగన్ పై ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పలు కేసులు నమోదయ్యాయి. ఆయన ఏకంగా 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో ఉండాల్సి వచ్చింది. వైస్సార్ మృతి చెందాక జగన్ పై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట పార్టీ ఏర్పాటు చేయడం తదనంతర పరిణామాలు. నాటి కేసుల విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ కు సహకరించిందనేది ప్రధాన ఆరోపణ. ఆ కేసుల్లో బెయిల్ పై వచ్చిన వైఎస్ జగన్ ఆ రెండు పార్టీలపై పోరాడుతూనే ఉన్నారు. ఈలోగా ఏపీ విభజన జరిగింది. ఏపీలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2018లో వైఎస్ జగన్ పార్టీ అద్భుతమైన మెజార్టీ సాధించింది. జగన్ సీఎం అయ్యారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో పోటీ చేయటం లేదని ప్రకటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వ్యతిరేక ఓటు చీల్చటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారామె. నవంబర్ 3వ తేదీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి.. వ్యతిరేక ఓటును చీల్చటం ద్వారా.. కేసీఆర్ గెలుపునకు సాయం చేయాలనే ఉద్దేశం లేదని వివరించారామె. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని.. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం అయినప్పుడు.. వ్యతిరేక ఓట్లు చీల్చటం వల్ల ఉపయోగం లేదని సలహా, సూచన చేశారాన్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చి.. కేసీఆర్ సీఎం అయితే.. చరిత్ర క్షమించదనే భయం కూడా ఉందన్నారు షర్మిల. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసే అవకాశం ఉన్నందున.. కాంగ్రెస్ పార్టీకి.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారామె.






Total views : 75454