Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Devotional మనదేశంలో అత్యంత మహిమగల శివాలయాలు

మనదేశంలో అత్యంత మహిమగల శివాలయాలు

by Satya
Magnificent Shiva temples

మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె.అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు. ఇది వండర్ అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి, కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు. వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది. ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి. భీమవరంలో సోమేశ్వరుడు, ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు. కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి, ఇక్కడికి కాకులు అసలు రావు గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది. ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు. బైరవకొన ఇక్కడకు కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు. యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు. శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక వైపు ఒకప్పుడు “ఝుం”అనే తుమ్మెద శబ్దం వినపడేదట కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. సంవత్సరంలో 6నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి మిగిలిన 6 నెలలు గుడి బయటకు కనిపిస్తుంది. శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది. అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది. కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు. మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది. కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు. తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి. హిమాచల్ ప్రదేశే రాజధాని సిమ్లాకు సరిగ్గా 235 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్‌ జిల్లా ఉంది. ఈ కిన్నౌర్‌ జిల్లా హిమాలయ పర్వత సానువుల్లో నెలకొని వున్న కిన్నెర కైలాసము. ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం , రాత్రి నీలంగా మారుతుంది.

Advertisements

You may also like

Our Visitor

008572
Total views : 56862

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.