Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఈవో రామాంజనేయులు సస్పెన్షన్..

చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఈవో రామాంజనేయులు సస్పెన్షన్..

by CVR NEWS

చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కే రామాంజనేయులును సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు అవకతవకలు గుర్తించి ఈవోను వెంటనే సస్పెండ్‌ చేశారు. అలాగే దేవాలయానికి దాతలు ఇచ్చిన బంగారు, వెండి ఆభరణాలపై సరైన జవాబుదారీతనం లేకపోవడాన్ని తనిఖీల్లో హనుమంతరావు గుర్తించారు. ఓ భక్తుడు స్వామివారికి సమర్పించుకున్న 2.30 కిలోల వెండి కిరీటానికి సంబంధించి రసీదు ఆయనకు ఇవ్వకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. సదరు కిరీటాన్ని మార్పు చేయడం కోసం కంసాలికి ఇచ్చి నాలుగేళ్లు గడిచినా తిరిగి తీసుకురాలేకపోయినట్లు గుర్తించారు . సదరు భక్తుడు ఆ కిరీటం గురించి అడిగితే నేను నీకు రసీదు ఇవ్వలేదు కాబట్టి నాకు బాధ్యత లేదు అంటూ ఈవో రామాంజనేయులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు విచారణ సందర్భంగా తేలింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: