Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల..

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల..

by CVR NEWS
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా,పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేకే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాసవ్వని స్టూడెంట్స్ క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, సప్లిమెంటరీకి మరింత సన్నద్ధమై పరీక్షలు రాసి, పాసవ్వాలని పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకూ పదో తరగతి పరీక్షలు జరగ్గా.. 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 4,97, 312 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు యోగితారాణా వెల్లడించారు. వీరిలో బాలికలు 96.26 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. బాలురు 94.07 శాతం మంది పాసైనట్లు తెలిపారు. మొత్తంగా 95.15శాతం మంది విద్యార్థులు పాసయ్యారని వివరించారు. 5731 స్కూళ్లలో విద్యార్థులు నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వివరించారు. ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాసవ్వలేదన్నారు. ములుగు జిల్లాలో 99.30శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి టాప్ లో ఉండగా.. 89.23 శాతం పాస్ పర్సెంటేజీతో హైదరాబాద్ లాస్ట్ లో ఉందన్నారు.

ద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ http://bse.telangana.gov.in/ లో పొందవచ్చని విద్యాశాఖ తెలిపింది. వాట్సాప్ నంబర్ కు ఒక్క మెసేజ్ చేసినా ఫలితాలు నేరుగా వస్తాయని సూచించింది. విద్యాశాఖ తొలిసారిగా పదవ తరగతి ఫలితాలను వాట్సాప్ ద్వారా అందిస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: