Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Andhra Pradesh ‘ఆడుదాం.. ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న రోజా

‘ఆడుదాం.. ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న రోజా

by Satya
Roja

విశాఖలో ‘ఆడుదాం.. ఆంధ్ర’ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో షర్మిల చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ను జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపారని రోజా ఆరోపించారు. తెలంగాణ నుంచి రావాల్సిన 6 వేల కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి రావాల్సిన లక్షా 8 వేల కోట్లు రాబట్టాలని షర్మిలకు మంత్రి రోజా సలహా ఇచ్చారు. రాష్ట్ర వాటాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ను, కాంగ్రెస్ అధినేత్రి సోనియాను షర్మిల ప్రశ్నించాలని సూచించారు. చంద్రబాబు, పవన్, షర్మిల ,నాన్ లోకల్ పొలిటీషియన్లు అని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల తర్వాత వాళ్లంతా తెలంగాణకు పారిపోతారని రోజా విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సింహంలాంటి వ్యక్తి అని, ఎన్నికలకు సింగిల్‌గానే వెళ్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: