Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి.. బీఆర్ఎస్ నేతల ఆందోళన

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి.. బీఆర్ఎస్ నేతల ఆందోళన

by Rama
Auto Drivers

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు 10 వేలు ఇవ్వాలన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణంగా… 6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలని కోరారు. ప్లకార్డులను పట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు. అయితే, కాసేపు వాగ్వాదం తర్వాత వారిని అనుమతించారు. Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: